ఆరిన ఆశా దీపాలు
ఆ పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకున్నారు.. తమ కంటిపాపలైన పిల్లలను ఉన్నతంగా చదివించాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ ఇంటి ఆశా దీపాలను ఆర్పేసింది. ఈ విషాదకర ఘటన బంగారుపాళెం మండలంలో చోటుచేసుకుంది. – బంగారుపాళెం
మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి ఆర్‌ఆర్ నగర్ వద్ద మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరిడివారిపల్లెకు చెందిన హేమశేఖర్ కుమారుడు గౌతం(21) చిత్తూరు పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తగ్గువారిపల్లె పంచాయతీ పరిధిలోని సాయినగర్‌కు చెందిన బాబు కుమారుడు గణేష్(14) బంగారుపాళెంలో ఓ ప్రెవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వీరు ద్విచక్రవాహనంపై మొగిలి వెంకటగిరి నుంచి బంగారుపాళెం వైపు వస్తుండగా చిత్తూరు నుంచి పలమనేరు పోతున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో గణేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గౌతం తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో తమ పిల్లలు మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
ఆరిన ఆశా దీపాలు
ఆరిన ఆశా దీపాలు
ఆరిన ఆశా దీపాలు
Comments
Please login to add a commentAdd a comment