కేసుల విచారణ వేగవంతం చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
చిత్తూరు అర్బన్ : జిల్లాలోని పలు కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. కొత్తగా చిత్తూరులో ఆరరోో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరికి స్వాగతం పలుకుతూ మంగళవారం సాయంత్రం స్థానిక బార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బార్, బెంచ్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. కేసుల విచారణ వేగవంతం చేసి సత్వరం తీర్పులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, జిల్లా ఫొక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, ఉమాదేవి, పధ్మజ, మాధవి, శ్రీనివాస్, షేక్బాబాజాన్, బార అసోసియేషన్ అధ్యక్షుడు శంకరనాయుడు, కార్యదర్శి సురేష్రెడ్డి, ఉపాధ్యక్షుడు భూప్రసన్న, న్యాయవాదులు పాల్గొన్నారు.
స్కూల్ స్వీపర్స్ సంఘం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా స్కూల్ స్వీపర్స్ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజన్, జిల్లా కార్యదర్శి కోదండయ్య మంగళవారం ప్రకటించారు. మొత్తం 23 మందితో జిల్లా సమితి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కోదండయ్య, జిల్లా అధ్యక్షురాలుగా ఆశ (గుడిపాల), జిల్లా ప్రధాన కార్యదర్శిగా జయకుమారి (కార్వేటినగరం), జిల్లా ఉపాధ్యక్షులుగా లక్ష్మి (నగరి ), తులసి (పాలసముద్రం), వనిత (బంగారుపాలెం), భువన (వెదురుకుప్పం), జిల్లా సహాయ కార్యదర్శులుగా ఇందిరా (ఎస్‌ఆర్‌పురం), మమతా (కార్వేటినగరం), కోకిల (జీడీనెల్లూరు), జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంజుల (ఎస్‌ఆర్‌పురం), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంధ్య( చిత్తూరు), జిల్లా కోశాధికారిగా రాధ (పెనుమూరు), వీరితో పాటు ఈసీ మెంబర్లుగా రోజా, మమత, దేశమ్మ, కాజముని, రమాదేవిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. వీరు మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారన్నారు.
సైన్స్‌పై మక్కువ పెరగాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని అపోలో యూనివర్శిటీలో ఈనెల 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించనున్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు జాతీయ విజ్ఞాన దినోత్సవ పోస్టర్‌లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు సైన్స్‌పై మక్కువ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాలు నిర్వహించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందుతాయన్నారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఫ్రొ.వినోద్‌భట్ మాట్లాడుతూ.. యూనివర్శిటీలో నిర్వహించే కార్యక్రమంలో స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించవచ్చన్నారు. వివిధ రంగాల్లో మొత్తం 27 బహుమతులను అందిస్తున్నట్లు చెప్పారు. స్థానిక విద్యార్థులు తమ ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించాలన్నారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులకు ప్రాథమికంగా పరిశోధన అభివృద్ధికి ఇలాంటి వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు ఆసక్తి ఉన్న విద్యాసంస్థలు 99595 40302, 98850 85025, 83330 74158 నంబర్లల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అపోలో యూనివర్శిటీ సిబ్బంది పాల్గొన్నారు.
కేసుల విచారణ వేగవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment