పండ్ల పరిశ్రమలో ఆధునిక సాంకేతికత
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని రైతులు అత్యధికంగా మామిడి సాగు చేస్తున్నారని, ఫలితంగా పండ్ల గుజ్జు పరిశ్రమలు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దక్షిణ భారత ఆహార శుద్ధి పరిశ్రమల దారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ బాబి అన్నారు. చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్‌లో మంగళవారం పరిశ్రమల ప్రతినిధులు, ఆల్ఫా లావల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూనే, స్వీడన్ దేశ ప్రతినిధులతో యాంత్రీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మామిడి గుజ్జు పరిశ్రమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తూ వస్తోందన్నారు. ప్రస్తుతం చాలా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అసెప్టిక్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశాయన్నారు. ఏటా జిల్లాలో సుమారు 8 లక్షల టన్నుల మామిడి పల్ప్ ఉత్పత్తి అవుతోందన్నారు. వీటి తయారీలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంచుకుంటూ ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ఇందులో భాగంగానే ఆల్ఫా లావల్ ఇండియా, స్వీడన్ దేశ ప్రతినిధులు జిల్లాకు వచ్చారన్నారు. ఉత్పత్తిదారులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఆల్ఫా లెవల్ వారు నాణ్యమైన సేవలను అందించేలా చూడాలని వివరించారు. ఆల్ఫా లావల్ స్వీడన్ దేశ ప్రతినిధి పీటర్ నెల్సన్ మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా జిల్లాలోని మామిడి పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు యంత్రాలను సరఫరా చేస్తోందన్నారు. అనంతరం పలు సమస్యలను ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు శివకుమార్, ల్ఫా లవర్ కంపెనీ స్వీడన్ దేశ ప్రతినిధులు, మార్కస్ హాఫ్మాన్, దేశ ప్రతినిధులు శుభాశీస్సు దాస్, ధర్మేశ్, హితేందర్ కుమార్, అతుల్ జోషి, భాస్కర్ ఆనంద్ పాల్గొన్నారు.
● స్వీడన్ ప్రతినిధులతో అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment