దోబీ ఘాట్ ఆక్రమణలు తగవు
సదుం : మండల కేంద్రంలో దోబీ ఘాట్‌కు కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తగవని బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. మండల కేంద్రంలోని కుమారొడ్డుని చెరువు వద్ద 76/1 సర్వే నంబరులో గతంలో రెవెన్యూ అధికారులు దోబీ ఘాట్ కోసం 53 సెంట్ల స్థలం మంజూరు చేశారు. అందులో కమ్యూనిటీ భవనం నిర్మాణం పూర్తి కాగా, దోబీఘాట్ పనులు జరుగుతున్నాయి. కాగా కొందరు రియల్టర్లు ఈ స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి.. తమ ప్లాట్‌ల కోసం రోడ్డును ఏర్పాటు చేసుకున్నారని పలు వురు రజకులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, తహశీల్దారు హుస్సేన్‌తో కలిసి కార్పొరేషన్ ఈడీ ఆక్రమిత ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారుల సాయంతో దోబీ ఘాట్‌కు కేటాయించిన భూమికి హద్దులు నిర్ణయించి, జేసీబీతో ట్రెంచ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రజక సంఘం ఏపీ అధ్యక్షుడు షణ్ముగం, సర్వే సిబ్బంది, నాయకులు బాబురెడ్డి, గోపాల్, నవీన్, గణేష్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై మూకుమ్మడి దాడి
పలమనేరు : మండలంలోని గొల్లపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భాను(42)పై సోమవారం రాత్రి కొలమాసనపల్లికి చెందిన వాసు తదితరులు పది మంది దాకా మూకుమ్మడిగా దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు మంగళవారం తెలిపారు. తాను ఇంటి వద్ద ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి చితకబాదారని ఆపై గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారైనట్లు బాధితుడు తెలిపారు. ప్రస్తుతం పలమనేరులోని ప్రభుత్వాసుపత్రిలో భాను చికిత్స పొందుతున్నాడు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
సీ్త్ర,శిశు సంక్షేమమే ధ్యేయం
వి.కోట : సీ్త్ర,శిశు సంక్షేమమే ధ్యేయంగా అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తూ , నిత్యం వారికి అందుబాటులో ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జ్ఞా నజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జె డ్పీ చైర్మన్ హాజరయ్యారు. బాలింతలు, గర్భిణులు ,శిశువులకు పౌష్టికాహారం అందించి వారి మెరుగైన ఆరోగ్యానికి కృషి చేయాలన్నారు. ఎంఈఓ–2 మురుగేష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అరుణశ్రీ, ప్రధానోపాధ్యాయుడు, ఉఫాధ్యాయులు మురళీ, రాఘవేంద్ర, రియాజ్ పాల్గొన్నారు.
దోబీ ఘాట్ ఆక్రమణలు తగవు
Comments
Please login to add a commentAdd a comment