చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా కసరత్తులో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని డీఈఓ వరలక్ష్మి అన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో సీనియారిటీ జాబితా కసరత్తు పై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పకడ్బందీగా నియమ, నిబంధనల ప్రకారం సిద్ధం చేయాలన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాలో ఇప్పటికే పలు కేడర్ల ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే మరోమారు ఆ ప్రాథమిక జాబితాను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక సమస్యలున్నట్‌లైతే పరిష్కరించాలన్నారు. జాబితాలోని తప్పులను సరిచేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఏడీలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, సూపరింటెండెంట్‌లు వీజీ రమణ, సత్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment