మహిళా సాధికారతే లక్ష్యం
తిరుపతి సిటీ : మహిళా సాధికారతే లక్ష్యంగా ప ద్మావతి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వైస్ చాన్సలర్ వి.ఉమ తెలిపారు. బుధవారం ఈ మేరకు వీసీగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక విద్యాలయంలో నిపుణులు, సమర్థులైన అధ్యాపకులు ఉన్నారని వెల్లడించారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో వర్సి టీని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు యత్నిస్తామని వివరించారు. అలాగే విద్యార్థినులను నూ తన పరిశోధనల దిశగా ప్రోత్సాహం అందిస్తామని, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నాణ్యమై న విద్యను అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే అ న్ని విభాగాల్లో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చే పడతామని వెల్లడించారు. విద్యార్థినులకు వర్సిటీ లో అధునాతన మౌలిక వసతులు, భద్రతకు ప్రా ధాన్యతనిస్తామని వివరించారు.
రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు 21న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఆంకురార్పణ జరగనుంది. 22న స్వామివారి ధ్వజారోహణం, 26న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 27న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 28న కల్యాణం, మార్చి 2న గిరిప్రదక్షిణ, 4న పల్లకీసేవ, 5న ఏకాంతసేవ, 6న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment