బోయకొండలో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో ఏటా మాఘ మాసంలో వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమం బుధవారం ప్రారంభమయింది. బోయకొండ ఆలయంలో 16 ఏళ్లుగా హిందూ సంప్రదాయ రీతిలో లక్ష కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే కుంకుమార్చనలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, మహా మంగళ హారతి చేశారు. 142 మంది దంపతులు కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. అనంతరం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉభయదారులకు అమ్మవారి వెండి కాయిన్‌తో పాటు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment