రేపు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం
చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ కార్యాలయంలో శనివారం జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు గురువారం సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. వినియోగంలో లేని జెడ్పీ పాత సమావేశ మందిరాన్ని బాగు చేసి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం ఉంటుందన్నారు. స్థాయి సంఘాలు, చిన్న చిన్న సమావేశాలకు పాత సమావేశ మందిరాన్ని వినియోగించుకుంటామన్నారు. సర్వసభ్య, ఇతర పెద్ద సమావేశాలకు నూతన మందిరాన్ని వాడుకోవచ్చన్నారు. అందులో భాగంగా సిబ్బందికి పలు ఆదేశాలను ఇచ్చామని తెలిపారు.నేల, సీట్లు, గోడలు మొత్తం శుభ్రం చేయాలన్నారు. అలాగే లైటింగ్, స్పీకర్లు మరమ్మతు పనులు , నీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో టైల్స్ వేయాలన్నారు. ఇక జెడ్పీ సమావేశ మందిరాన్ని ఇతర శాఖలకు నామమాత్రపు అద్దెతో ఇవ్వనున్నామని చెప్పారు.
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
బంగారుపాళెం : బాల్యవివాహాలు చేస్తే అనర్థాలు తప్పవని తహసీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఓ గ్రామంలో బాల్యవివాహం చేస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు స్పందించి అడ్డుకున్నారు. బంగారుపాళెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి పలమనేరు మండలానికి చెందిన ఓ బాలికతో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పలమనేరు సీడీపీఓ ద్రాక్షాయణి, బంగారుపాళెం సీడీపీఓ వాణిశ్రీదేవి, సీఐ శ్రీనివాసులు, సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం తహశీల్దార్ బాబురాజేంద్ర ప్రసాద్ ఎదుట హాజరు పరచగా ఇరువురి కుటుంబ సభ్యులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు.
కాణిపాకంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని గురువారం రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన సేవలు చేయించారు. ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి, కోర్టు సిబ్బంది ఉన్నారు.
వరసిద్ధుని సేవలో 20 సూత్రాల కమిటీ చైర్మన్
కాణిపాకం వినాయ క స్వామిని గురువా రం రాష్ట్ర 20 సూ త్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ద ర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. ఆర్డీఓ శ్రీనివాసులు ఉన్నారు.
రేపు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం
Comments
Please login to add a commentAdd a comment