– ముగ్గురు నిందితుల అరెస్టు
పుంగనూరు : వివిధ ప్రాంతాల పొలాల్లోని శ్రీగంధం చెట్లను నరికి , ముక్కలుగా చేసి స్మగ్లింగ్ చేసే ముఠాను బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. మండలంలోని నల్లగుట్లపల్లెతండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సుమారు 500 కిలోల శ్రీగంధం ముక్కలను స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధం చేస్తుండగా సమాచారం మేరకు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం. నిందితులను, గంధం చెక్కలను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment