పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఎంతో ప్రాచుర్యం కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ ‘ఏ’ (స్కోర్ 3.13) గ్రేడ్ లభించింది. ఈ మేరకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గురువారం గ్రేడ్‌ను ప్రకటిస్తూ కళాశాలకు ఉత్తర్వులు పంపింది. పీవీకేఎన్ కళాశాలకు గతం కంటే ప్రస్తుతం న్యాక్ గ్రేడ్ మెరుగుపడింది. ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి, అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థుల కృషితో కళాశాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ కళాశాలలో ఆర్థిక నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment