అక్రమార్కులకు ఉపాధి
కాణిపాకం : పూతలపట్టు మండలం వావిల్‌తోట పంచాయతీలో ఉపాధిహామీ పనుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులకు కొందరు ఫిర్యాదు చేశా రు. పనులు జరగకుండానే..కాలువ పని పేరుతో రో జుకు 180 మందికి మస్టర్ వేస్తున్నారని అందులో పేర్కొన్నారు. 10 మందితో 180 మంది పనిచేస్తున్న ట్లు చిత్రీకరిస్తున్నారని, 10 మందిని వివిధ చోట్ల పనిచేస్తున్నట్లు చూపిస్తున్నారని ఫొటోల సహా ఆన్‌లైన్ వివరాలను పంపారు. ఇలా వారానికి రూ.3 లక్షల వ రకు కొల్లగొట్టారని అందులో ఆరోపించారు. ఆరు నె లల కాలంలో రూ.30 లక్షలు మింగేశారని గ్రామస్తులు ఫిర్యాదులో వివరించారు. కూటమి నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు కుమ్మక్కై ఉపాధి డబ్బులు దోచేస్తున్నా రు. ఇష్టానుసారంగా పనులు చేస్తూ అయిన కాడికి దండుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బోగస్ కూలీలను సృష్టిస్తూ మస్టర్‌లో మాయజాలంను సృష్టిస్తున్నారు. సాంకేతికతకు చుక్కలు చూపిస్తున్నారు. వేతనం గిట్టుబాటు లేకపోవడంతో కూలీలు అల్లాడిపోతున్నారు. చివరకు కూలీలే ఛీకొట్టే పరిస్థితి దాపురించింది. ఈ తతంగంపై ఉపాధిహామీ అధికారులు చూ సీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అనుకూలమైన వారిని నియమించుకొని..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వారి స్థానంలో స్థానిక కూటమి నేతలకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. కూటమి నేతలతో వారు కుమ్మకై ్క ఉపాధిలో అక్రమాల వేటను మొదలుపెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
తప్పుల తడకగా మస్టర్‌లు
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు నేతలు ఉపాధిని లక్ష్యంగా చేసుకున్నారు. మేట్లను అడ్డుపెట్టుకుని ఉపాధి పనుల్లో కాసులు దండుకుంటున్నారు. రెండేళ్ల కిందట మ్యానువల్‌గా మస్టర్లు వేసేవారు. ఈ మస్టర్లు తప్పులు తడకగా ఉండడంతో పాటు పలు అక్రమాలు వెలుగు చూశాయి.
ఫొటోలతో మాయ..
10 మందిని తీసుకొచ్చి... వాళ్లతో పలుచోట్ల పని చేయిస్తున్నట్లు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ పంచాయతీలోని కూలీలు రాకుంటే పక్క గ్రామంలో 10 మందిని తీసుకొచ్చి ఫొటోలతో పనిచేసినట్లు సృష్టిస్తున్నారు. ఇలా రోజువారీ 100 నుంచి 180 మంది బినామీ పేర్లు పెట్టి పనిచేయిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో మస్టర్లు వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వెలుతున్నాయి.
యంత్రాలతో పనులు
పంట సంజీవని, ఇతర పనులను యంత్రాలతో పనులు చేయించి బినామీ కూలీలతో బిల్లులు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
కూటమి నేతలు, ీఫీల్డ్ అసిస్టెంట్‌లు కుమ్మక్కు
పనులు చేయకుండానే బిల్లులు
చేసిన చోటే మళ్లీ పనులు
బోగస్ కూలీల నమోదు
తనిఖీలున్నా..తగ్గేదేలే..
ఉపాధి హామీలో జరుగుతున్న పనులకు సంబంధించి ఏటా సామాజిక తనిఖీలు చేపడుతుంటారు. ఇందుకు సీఆర్‌పీలు, డీఆర్‌పీలు, ఎస్‌ఆర్‌పీలు బృందంగా వెళ్లి పనులను పరిశీలిస్తుంటారు. ఏవైనా అక్రమాలుంటే వెంటనే బహిరంగ సభలో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. వీటిని సైతం లెక్క చేయకుండా కూటమి నేతలు, క్షేత్ర సహాయకులు అధికారం ఉందని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి తనిఖీలను మట్టుపెట్టవచ్చునని భావిస్తున్నారు. ఆ సయమానికి కాసులిచ్చి అక్రమాలను కప్పిపుచ్చుకోవచ్చని నిర్భయంగా ఉపాధి నిధులను బినామీల పేరుతో కాజేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ పనులు కొందరి కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వలసలు నివా రించేందుకు ఉద్దేశించిన పథకం అక్రమార్కులకు వరంగా మారింది. చేసిన పనులనే మళ్లీ చేయ డం..బోగస్ హాజరు పెట్టి దండుకోవడం.. పను లు చేయకున్నా బిల్లులు పొందడం.. కూలీలు రాకుండానే వచ్చినట్లు మస్టర్లు సృష్టించడం.. సాంకేతికతను పక్కదారి పట్టించి ..అధికారుల కళ్లకు గంతలు కట్టి దర్జాగా ఉపాధి నిధులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
వావిల్‌తోటలో జరిగిన పనులపై ఫిర్యాదులు అందా యి. దీనిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చేపట్టిన పనులపై ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో ఏం జరిగిందో వాళ్లే చెబుతారు. ఉపాధి హామీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసులు, క్లస్టర్ ఏపీడీ, పూతలపట్టు
మండలం పంచాయతీలు గుర్తించిన పనులు మస్టర్ల సంఖ్య పనికి హాజరవుతున్నవారు
చిత్తూరు 17 47 113 610
గుడిపాల 27 55 149 860
బంగారుపాళ్యం 41 90 295 1209
ఐరాల 28 129 228 1540
పూతలపట్టు 25 103 172 1127
తవణంపల్లి 32 68 123 589
యాదమరి 26 36 103 740
Comments
Please login to add a commentAdd a comment