బింబం, ప్రతిబింబం..
చిత్తూరు నగరానికి చెందిన న్యాయ వాది కృష్ణకిశోర్, మంజులరాణి దంపతులకు జన్మించిన అర్జున్, అంజన్ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఒకే ముఖ కవళికలతో కన్పిస్తుంటారు. బింబ, ప్రతిబింబాలుగా నిలుస్తారు. వారి అభిలాష ఒకే విధంగా ఉంటాయి. వీరిద్దరి అభిరుచులు దాదాపు ఒకటిగానే ఉంటాయి. ఎంతో చలాకీగా ఉంటారు. ఈ ఇద్దరి జన్మదినం కూడా కవలల దినోత్సవం రోజునే కావడం మరో విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. – అర్జున్, అంజన్
నగరంలోని చంద్రశేఖర్, లక్ష్మిదేవి దంపతులకు బబిత, భవిష్య కవలలున్నారు. అల్లరిలో వారి ఇద్దరూ ఇద్దరే. ఎక్కడికెళ్లినా ఇద్దరినీ తీసుకెళ్లాల్సిందే. ఏది తెచ్చినా ఇద్దరికీ తీసుకురావాల్సిందే. ఇద్దరూ ఒకే రకమైన ఆహారాన్ని ఇష్టపడుతారు. వీరిని పోల్చుకునేందుకు తల్లిదండ్రులు తంటాలు పడుతుంటారు. పాఠశాలలో ఇద్దరినీ గుర్తుపట్టలేక టీచర్లు తికమకకు లోనవుతుంటారు. – బబిత, భవిష్య
చిత్తూరులోని మధు, సాయిరాణి దంపతుల కవలలు హేమచంద్ర, అభినవ్. వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరి ఆహారపు అలవాట్లు, అభిరుచుల విషయంలో ఒక్కలాగా ప్రవర్తిస్తారని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారు పెరుగుతున్న కొద్దీ ప్రతి దాంట్లో పోటీ ఎక్కువగా ఉంటోదంటున్నారు. చూడటానికి సన్నగా ఉన్నా వారి ఉత్సాహాన్ని చూసి ఉపాధ్యాయులే ముచ్చట పడుతుంటారు. – హేమచంద్ర, అభినవ్
గుర్తుపట్టలేనంతగా ...
ఒకేలా పనులు
బింబం, ప్రతిబింబం..
బింబం, ప్రతిబింబం..
Comments
Please login to add a commentAdd a comment