మొక్కుబడిగా చైర్మన్ పర్యటన
– సమస్యల పరిష్కారంపై నోరు మెదపని వైనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఏపీ మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ పర్యటన మొక్కుబడిగా సాగింది. సమావేశం మమ అనిపించేలా నిర్వహించి కలెక్టర్‌ను కలిసి వెళ్లిపోయారు.
ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం
ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి ఎస్సీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయకుమార్ అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047లో ఎస్సీ కుటుంబాల నుంచి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామన్నారు. మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చైర్మన్ అన్నారు. సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 1000 యూనిట్లు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చిన్నయ్య, డైరెక్టర్‌లు బాబు, కుమారి, యుగంధర్, డీవీఎంసీ సభ్యులు రాజ్‌కుమార్, మునస్వామి, వరలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment