వాణిజ్య పంటల సాగుపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులకు వాణిజ్య పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ కార్యచరణ ప్రణాళికల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల దృష్టిని వాణిజ్య పంటల సాగు వైప మళ్లీంచాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళికృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి పరిశ్రమలో మాక్‌డ్రిల్ తప్పనిసరి
జిల్లాలోని ప్రతి పరిశ్రమలో కచ్చితంగా అధికారుల సమక్షంలో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్ర మాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.
వెబ్‌ల్యాండ్ కరెక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి
జిల్లాలోని తహసీల్దార్లు వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్‌పై ప్ర త్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల ఖారులోపు కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు అదనపు ఆర్థిక సహాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు త్వరతిగతిన ఇళ్ల ని ర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామా ల్లో, నగరాల్లో బోర్ల మరమ్మతులు, పైప్‌లైన్ల లీకేజీలను గుర్తిస్తున్నట్లు చెప్పారు.