పాలసముద్రం : మండలంలోని నరసింహపురంలో సారా బట్టీలపై కార్వేటినగరం ఎకై ్సజ్ సీఐ శిరీషాదేవి, పాలసముద్రం ఎస్‌ఐ చిన్నరెడ్డిప్ప తమ సిబ్బందితో కలసి సోమవారం దాడులు చేశారు. సుమారు వెయ్యిలీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. సీఐ మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు తప్పవని హెచ్చరించారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 279 వినతులు
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ మేరకు ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరి అర్జీలు స్వీకరించారు. డీఆర్‌ఓ మోహన్‌కుమార్, ఆర్‌డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై మొత్తం 279 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


