తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రామరంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో శాబ్దబోధ మీమాంశ అనే అంశంపై వారం రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పద్మభూషణ నవలపాకం శతకోప రామానుజతాచార్య రచనలో వివరించిన శాబ్దబోధంపై తత్వశాస్త్ర, భాషా విశ్లేషణ జరగనుంది. దర్శన, వ్యాకరణ విభాగాలలో పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని, స్పోటవాదం, అభిహితాన్వయ, అన్వితాభిధానవాదం వంటి ముఖ్యమైన అంశాలపై మహాపండితులు చర్చించనున్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకోసం ప్రొఫెసర్ సి రంగనాథన్ 94409 19106, డాక్టర్ ఓజీపీ కళ్యాణ శాస్త్రి 88856 73667లను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటలో తెలిపారు.
పుత్తూరు రైటర్ వీఆర్‌కు!
– రాజకీయ ఒత్తిల్లే కారణమా?
పుత్తూరు : స్థానిక పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.రవి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్ (వేకన్సీ రిజర్వుడు)కు బదిలీ అయ్యారు. గురువారం జరిగిన ఈ బదిలీ కేవలం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్‌కు వివిధ కేసుల్లో పట్టుకొస్తున్న నిందితులను స్థానిక టీడీపీ నాయకులు వారు మావారే వదిలి పెట్టాలంటూ పోలీసులపై అధికార జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలపైనే ఇలా అయితే మా ఉద్యోగాలు ఎలా చేయాలంటూ రైటర్ రవి ప్రశ్నించడంతో అతనిని టార్గెట్ చేసి వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. చూశారా మేము చెప్పింది చేయకపోతే ఇలానే ఉంటుందంటూ స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు పంపుతున్నారు. రాజకీయంగా తమ పలుకుబడిని చూపేందుకే చిరుద్యోగిపై ప్రతాపం చూపారంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కార్వేటినగరం : 5 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కార్వేటినగరం ఎకై ్స జ్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చే క్రమంలో భాగంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని జంగాలపల్లి సమీపంలోని చిన్న కాలువలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి, సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి మూడు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే బెల్లం ఊటకు సంబంధించిన చిన్నతయ్యూరు గ్రామం మిల్టన్ కుమారుడు పొన్న ప్రభుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎస్‌ఐ సుబ్రమణ్యం, హెడ్ కానిస్టేబుల్ మునిసుందరం, సిబ్బంది పాల్గొన్నారు.
‘కళైకావేరి’తో ఎస్వీయూ ఒప్పందం
తిరుపతి సిటీ : తమిళనాడులోని తిరుచిరాపల్లెకు చెందిన కళై కావేరి లలిత కళల కళాశాలలో పలు అంశాలపై ఎస్వీయూ కళలప్రదర్శన అధ్యయన విభాగం శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధ్యాపకులు, విద్యార్థులు పరస్పర అభ్యసన, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించునే వెసులుబాటు ఉంటుంది. కార్యక్రమలో ఆచార్య శంకర్ గణేష్, ఆచార్య ఉమామహేశ్వరి, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
నేటి నుంచి వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాపు


