చెట్లు మనం నాటితే.. వైఎస్సార్ సీపీ వారు కాయలుకోస్తారు!
–ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్
చిత్తూరు రూరల్(కాణిపాకం): ‘చెట్లు మనం నాటితే వైఎస్సార్‌సీపీ వారు కాయలుకోస్తారు.’ అంటూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అన్న మాటలు చిత్తూరులో చర్చనీయాంశమయ్యాయి. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటనలో భాగంగా చిత్తూరు నగరంలోని వన్‌డిపో ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. కొబ్బరి మొక్క నాటుతున్న సమయంలో చెట్లు మనం నాటితే.. వైఎస్సార్‌సీపీ వారు కాయలు కోస్తారంటూ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ఓ నవ్వు నవ్వారు. దీంతో అక్కడున్న కొందరు మహిళలు ‘అన్నా మనం ఇంకొసారికి అధికారంలోకి రామా’ అంటూ అడిగారు. అందుకు ఆయన నవ్వుతూ చెట్లు నాటి నీళ్లు పోశారు. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ చర్చ మధ్యలో ఆర్టీసీలో బస్సు టైర్లు మార్చడానికి డబ్బులు లేవని నవ్వులు పూయించారు.
పది పరీక్షల్లో విద్యార్థి డిబార్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వి.కోట మండలం జెడ్పీ బాలుర హైస్కూలులో చూచిరాతలకు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన పదో తరగతి బయాల జీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 21,143 మంది విద్యార్థులకు గాను 20,895 మంది హాజరై 248 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. డీఈఓ 2, ఫ్లయింగ్ స్క్వాడ్ 15 మంది 19 పరీక్ష కేంద్రాలను పరిశీలించారన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెల్లడించారు.
పది సోషల్ పరీక్ష వాయిదా
చిత్తూరు కలెక్టరేట్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీన నిర్వహించాల్సిన పదో తరగతి సోషల్ పరీక్షను వాయిదా వేశారని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం సోషల్ పరీక్ష ఈ నెల 31వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు రంజాన్ పండు గ రావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాయిదా వేసిన సోషల్ పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
విద్యుత్ ప్రమాదాల నుంచి వన్యప్రాణులకు రక్షణ
బంగారుపాళెం: పొలాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో వన్య ప్రాణులు విద్యుత్ షాక్‌కు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు ట్రా న్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పొలాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని ట్రాన్‌ఫార్మర్లు ఎత్తు పెంచే పనులను ఈఈ మునిచంద్రతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు డివిజన్ పరిధిలోని బంగారుపాళెం, యాదమరి మండలాల్లో అటవీ సరిహద్దుల్లోని పొలాల వద్ద తక్కువ ఎత్తులో ఉన్న 20 ట్రాన్‌ఫార్మర్లు, వైర్లు ఎత్తు పెంచినట్లు తెలిపారు. బంగారుపాళెంలో 70 ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ట్రాన్‌ఫార్మర్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. తక్కువ ఎత్తులో ట్రాన్‌ఫార్మర్లు, పొలాల వద్ద ఉన్న విద్యుత్ తీగలు కారణంగా వన్యప్రాణులు కరెంట్ షాక్ గురై మృత్యువాత పడిన నేపథ్యంలో ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ట్రాన్‌కో ఏడీ కొండయ్య, రూరల్ ఏఈ హేమచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్‌బ్రాంచ్‌లో
పలువురికి స్థానచలనం
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖలోని స్పెషల్ బ్రాంచ్‌లో పలువురిని బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. స్థానచలనం పొందినవారిలో దీర్ఘకాలికంగా పచిచేస్తున్న వారు కొందరు, పలుసార్లు ఇదే శాఖలో పనిచేస్తున్న మరి కొందరు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పలు స్టేషన్లకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు.


