రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
– భర్తకు తీవ్రగాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద సోమవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని పాల ట్యాంక్ ఢీకొంది. ఈ సంఘటనలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తవ ణంపల్లె మండలం అరగొండ పైమాఘం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌శెట్టి, భార్య రాజేశ్వరి, మనవరాలు జ్యోతిక ద్విచక్రవాహనంపై మొగిలీశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు మొగిలి గ్రామానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం వీరు స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. మొగిలి వద్ద రహదారి దాటుతుండగా పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న పాలట్యాంకర్ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేశ్వరి(55)సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. చంద్రశేఖర్‌శెట్టి తీవ్రంగా గాయపడగా, జ్యోతిక స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్‌శెట్టిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి


