చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్ మృతి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూ రు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈఓ)గా వి ధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉద యం ఆయన కుటుంబ స భ్యులు ఈ మేరకు ఒక ప్రక టనలో పేర్కొన్నారు. గత కొ ద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. టీచర్లు ఏవైనా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూ రు జిల్లాగా ఉన్న సమయంలో ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ హెచ్‌ఎం ఆయనే కావడంతో డీవైఈఓగా నియమించారు. డీవైఈఓ ఆకస్మిక మృతి పట్ల కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఈఓ వరలక్ష్మి సంతాపం వ్యక్తం చేశా రు. వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే డీవైఈఓ మృతి చెందడం విద్యాశాఖకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు మండలం దేవలచేను గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు చంద్రశేఖర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మృతి బాధాకరం
డీవైఈఓ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి బాధాకరమని ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. పాత కలెక్టరేట్‌లోని డీవైఈఓ కార్యాలయం వద్ద సోమవారం డీవైఈఓ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీవైఈఓ ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. అనంతరం హెచ్‌ఎం అరుణ్‌కుమార్ మాట్లాడుతూ డీవైఈఓ చంద్రశేఖర్ మృతి విద్యాశాఖకు, తమకు తీరని లోటన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ఆయన తమకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సెల్వరాజ్, త్యాగరాజరెడ్డి, గణపతి, హెచ్‌ఎంలు రవి, తులసిబాబు, భాస్కర్, డీవైఈఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ తులసి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్ మృతి


