కాలిపోయిన కోళ్లఫాంను పరిశీలించిన పెద్దిరెడ్డి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని చెరువు ముందరపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన కోళ్ల ఫాం గోడౌన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గోడౌన్‌లోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే వస్తు సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా, నిరంజన్‌రెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి, జెడీ నారాయణ పాల్గొన్నారు.
నేడు, రేపు ఏఎన్‌ఎంల
ఉద్యోగోన్నతికి కౌన్సెలింగ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గ్రేడ్–3 ఏఎన్‌ఎం ఉద్యోగోన్నతికి సంబంధించిన తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. గతేడాది ప్రారంభమైన జాబితా తయారీ ప్రక్రియ...పలు ఆరోపణల నడుమ బుధవారం సాయంత్రానికి పూర్తి చేశారు. 1000 మందిపైగా గ్రేడ్–3 ఏఎన్‌ఎంలుంటే 307 మందితో ఈ జాబితా సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉద్యోగోన్నతికి సంబంధించి కౌన్సెలింగ్ చిత్తూరు నగరంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. డీఆర్‌ఓ సమక్షంలో కౌన్సెలింగ్ జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై కొంతమంది మళ్లీ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశామని అంటున్నారు.


