ప్రభుత్వ బడిలోనే చేర్పిద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని డీఈఓ వరలక్ష్మి కోరారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్‌లపై యూటీఎఫ్ సంఘం రూపొందించిన పోస్టర్లను బుధవారం డీఈఓ ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల గొప్పదనం తెలుపుతూ యూటీఎఫ్ సంఘం రూపొందించిన పోస్టర్లు చాలా బాగున్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్‌ల పెంపునకు యూటీఎఫ్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్, జిల్లా సహాధ్యక్షులు రెహానా బేగం, రెడ్డెప్ప, ఎస్పీ భాషా, పార్థసారథి పాల్గొన్నారు.


