అలరించిన సెలెస్టా–2కే25
చిత్తూరులో జరిగిన సెలెస్టా–2కే25 అలరించింది. సినీనటుడు కిరణ్ అబ్బవరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు లేకుండా స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేయాలన్నారు. నగరాలు, గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకొకసారి కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. తాగునీటి పైపులు లీకేజీ ఉన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. డీఈ, ఏఈలు గ్రామాల్లో పర్యటించి నీటి సమస్యలున్న ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు.
నిత్యం పరీక్షలు చేయాలి
గ్రామాల్లో సరఫరా చేసే తాగునీటిని నిత్యం పరీక్షలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనుల బిల్లులను వెంటనే జెడ్పీకి పంపించాలన్నారు. సంబంధిత బిల్లులను జెడ్పీలో త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయకుమార్, డీపీఓ సుధాకర్‌రావ్ పాల్గొన్నారు.
హార్టికల్చర్ కాంక్లేవ్ విజయవంతంగా నిర్వహించండి
మామిడి అమ్మకం, కొనుగోలుదారుల నిమిత్తం జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం మామిడి అమ్మకందారులు, కొనుగోలుదారులతో కార్యక్రమం ఉంటుందన్నారు. మామిడి ఎగుమతికి సంబంధించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ అనుబంధ, పౌరసరఫరాలు, డీఆర్డీఏ, డీఎల్‌డీఓలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి, డీఎస్‌ఓ శంకరన్, సివిల్ సప్‌లైస్ డీఎం బాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డీఎల్‌డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
– 8లో


