ఉన్నతాశయంతో ముందుకు సాగాలి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు ఉన్నతాశయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఐఎన్‌టీఎస్‌ఓ ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ సాధించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పోటీ పరీక్షలపై పట్టు పెంచుకోవాలన్నారు. ప్రణాళిక ప్రకారం చదివితే ఎంత కష్టమైనా విజయం సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు అన్ని అంశాలపై పట్టు పెట్టుకోవాలన్నారు. కాగా ఒలంపియాడ్ పరీక్షల్లో ఏడో తరగతి చదువుతున్న ఈషాప్రీతి (గ్రాండ్ బహుమతిగా ల్యాప్‌టాప్), నాలుగో తరగతి చదువుతున్న కీర్తన్‌కుమార్, ఐదో తరగతి చదువుతున్న తస్మియా ఫర్హాద్, తేజేష్, ఆరో తరగతి చదువుతున్న వెన్నెల, తొమ్మిదో తరగతి చదువుతున్న కీర్తన ట్యాబ్‌లు కై వసం చేసుకున్నారు. ఆ విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు, సర్టిఫికెట్, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల రీజినల్ ఇన్‌చార్జి చక్రధర్, ప్రిన్సిపాళ్లు సాగరిక, రేఖ, రేణుక, అకడమిక్ కోఆర్డినేటర్లు రవికుమార్, మొహమ్మద్ ఇక్భాల్ తదితరులు పాల్గొన్నారు.


