సమన్వయంతో పనిచేయండి
● ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా నిలుస్తోంది ● ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
వెదురుకుప్పం: అందరూ కలిసికట్టుగా ఉండి సమన్వయంతో పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. గురువారం మండలంలోని మాంబేడు గ్రామంలో పర్యటించి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు బండి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చిందన్నారు. కక్ష కట్టుకుని పేద వారిపై వివక్ష చూపుతుందని చెప్పారు. జగనన్న హయాంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకతీతంగా సేవలు అంచామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది గడవక ముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటున్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. కార్యకర్తలకుగా అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్, ఎంపీటీసీ సభ్యుడు గుణశేఖర్, సర్పంచ్ గోవిందయ్య, మాజీ సర్పంచ్‌లు పెద్దిరెడ్డి, గోవిందన్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజీ, యువజన విభాగం మండల అధ్యక్షుడు గణపతిరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, సచివాలయ కన్వీనర్ జగదీష్‌రెడ్డి, నాగరాజు, వెంకటేశ్, కేశవులు, ఆర్ముగం, వెంకటాచలం, విజయభాస్కర్ పాల్గొన్నారు.
ఎంపీతో మాజీ మంత్రి భేటీ
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంపీ మిథున్‌రెడ్డిని గురువారం తిరుపతిలోని ఎంపీ నివాసంలో కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.


