భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
● భూ సమస్యలు ఉంటే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి ● ఎస్పీ మణికఠ చందోలు
కార్వేటినగరం: జిల్లాలో ఎవరైనా భూములను ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వీ.ఎన్ మణికంఠ చందోలు హెచ్చరించారు. గురువారం మండలంలోని గంగమాంబాపురంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న భూ వివాదాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితులేమిటో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడ భూ వివాదాలపై రెవెన్యూ, పోలీసు అధికారుల నివేదిక ఆధారంగా బాధితులకు న్యాయం చేస్తామని, గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. భూ ఆక్రమణలపై సైతం జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ప్రతి సోమవారం ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతరం కార్వేటినగరం సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట నగరి డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్, సీఐ హనుమంతప్ప, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు


