మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం
సదుం: పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా తాము ఉంటామని, ఎవరు, ఏ కష్టానికీ భయపడాల్సిన పని లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ మాధవితో కలసి ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలు అధికారులపై పలు ఫిర్యాదులు చేశారు. చర్యలు తీసుకుంటామని, అమాయకులైన ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నాయకులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికే ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడమే తమ ఆశయమని చెప్పారు. ప్రతి ఒక్కరినీ కలసి, సమస్యలు తెలుసుకుంటానని, ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తామని ఎంపీ ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని కలిసేందుకు వచ్చిన వారందరికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇమ్రాన్, పుట్రాజ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జర్నలిస్టుల ఆహ్వానం
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు హాజరు కావాలని ఆ సంఘం ప్రతినిధులు ఎంపీ మిథున్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 22న చిత్తూరులో జరగనున్న సభలకు తప్పక హాజరుకావాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో ప్రతినిధులు జయరాజు, రామయ్య, సలీం, సతీష్, ప్రకాష్, సైపుల్లా, అప్ప, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ఘన స్వాగతం
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎంపీ హామీ
సదుం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన సొంత నిధులు కేటాయిస్తామని ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు మల్లెల గిరి, లోకనాథం, శ్రీరాములు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ తక్షణమే పనులు చేయాలని, సొంత నిధులతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
సదుం మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బూరగమందక్రాస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే శాలువ కప్పి సన్మానం చేశారు.
మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం


