వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా

Published Sun, Apr 13 2025 2:07 AM | Last Updated on Sun, Apr 13 2025 2:07 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా

తిరుపతి మంగళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ‘పొలిటికల్‌ అడ్వైజర్‌ కమిటీ’ని పూర్తి స్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించి పీఏసీ మెంబర్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పీఏపీ మెంబర్లుగా మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.

రేపు అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తేదీన డాక్టర్‌.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కు మార్‌ గాంధీ వెల్లడించారు. శనివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు దర్గా సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళుల ర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం అ క్కడ నుంచి అంబేడ్కర్‌ చిత్రపటంతో మెసానికల్‌ మైదానం వద్ద ఉన్న అంబేడ్కర్‌ భవనానికి ర్యాలీ నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మి కులు, విద్యార్థులు హాజరు కావాలని కలెక్టర్‌ కోరారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడిగా రవి

పలమనేరు : పట్టణానికి చెందిన బీసీ నేత పూసల రవి జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ మేరకు హైదరాబాదు బీసీ భవన్‌లో శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. క్రిష్ణయ్య నుంచి నియామక పత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. ఈ పదవి రాకతో మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా 1
1/3

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా 2
2/3

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా 3
3/3

వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement