రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు | - | Sakshi
Sakshi News home page

రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు

Apr 13 2025 2:07 AM | Updated on Apr 13 2025 2:07 AM

రేపు

రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈనెల 14న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 14వ తేదీన డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఆలయాల నిర్మాణం

కార్వేటినగరం : వైఎస్సార్‌సీపీ హయాంలోనే రాష్ట్రంలో అత్యధికంగా ఆలయాల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని టీటీ కండ్రిగ గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన శ్రీకృష్ణుని ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ ఆలయాల నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. 2014 ఎన్నికల అనంతరం అనేక ఆలయాలను కూల్చి వేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. డిప్యూటీ సీఎంగా నియోజకవర్గంలో సుమారు 84 ఆలయాల నిర్మాణం చేపట్టానన్నారు. వీటితో పాటు వరద వేంకటేశ్వరస్వామి ఆలయం, కలిగిరి వేంకటేశ్వరస్వామి పురాతన ఆలయాలను టీటీడీలో విలీనం చేయించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తు న్నా ఒక్క ఆలయ నిర్మాణం చేపట్టిన పాపాన పోలేదని విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సర్వేశ్వర్‌, జేసీఎస్‌ కన్వీనర్‌ పురంధర్‌, జిల్లా రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మాజీ సర్పంచ్‌ ధర్మయ్య, మాజీ సింగిల్‌విండోఅధ్యక్షుడు లోకనాథరెడ్డి పలువురు పాల్గొన్నారు.

రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు 
1
1/1

రేపు ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement