ఆనందపురం : మండలంలోని వేములవలస వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమునిపట్నం మండలం, చిప్పాడ గ్రామానికి చెందిన సరగడ భరద్వాజ్ (25) గత ఆరేళ్లుగా జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్ బదిలీకాగా ఈ నెల 1న సెలవుపై ఇంటికి వచ్చాడు. అతనికి వివాహం కాలేదు. మంగళవారం తన అన్న శివ, స్నేహితుడు వెంకటే‹Ùతో కలిసి గ్రామ సమీపంలో గల లే అవుట్‌లో కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు.
ఆ కారు మరమ్మతులకు గురికాగా అన్నయ్య శివను ఇంటికి పంపించేసి, కారుకు మరమ్మతులు చేయించడానికి స్నేహితుడు వెంకటే‹Ùతో కలిసి తరగపువలస వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా భరద్వాజ్ ఇంటికి రాకపోవడంతో అన్నయ్య శివ ఫోన్ చేయగా కారు మరమ్మతులు పూర్తయిన వెంటనే వచ్చేస్తానని చెప్పాడు. ఇందిలా ఉండగా వేములవలస జాతీయ రహదారిపై కారుని మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో భరద్వాజ్ తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్టు పోలీసు లు భరద్వాజ్ అన్నయ్య శివకు సమాచారం అందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు వెళ్లగా అప్పటికే భరద్వాజ్ మృతి చెందాడు. పెందుర్తి వైపు నుంచి వెళ్తున్న కారు ఎదురుగా రాంగ్ రూట్లో మోటార్ బైక్‌పై వస్తున్న భరద్వాజ్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు.
కాగా తగరపువలసలో కారు మరమ్మతులు చేయిస్తున్న భరద్వాజ్ తన స్వగ్రామం చేరుకోవడానికి విజయనగరం రోడ్డు వైపు ప్రయాణించాల్సి ఉండగా రాత్రి వేళ రాంగ్ రూట్లో ఆనందపురం వైపు రావాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అలాగే భరద్వాజ్ ఏదో పనిపై మధురవాడ వెళ్లి వచ్చినట్టు మరో కథనం వినిపిస్తోంది. మృతునికి తండ్రి వెంకట రమణ, తల్లి అరుణ, సోదరుడు శివతోపాటు సోదరి ఉంది. వీరిది వ్యవసాయ కుటుంబం. ఎస్‌ఐ నరసింహమూర్తి మృతదేహాన్ని పోస్టు మారా్టనికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చిప్పాడలో విషాదం నెలకొంది. కారు రూపంలో మృత్యువు తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు
తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment