
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడింది. టెక్కలి సమీపంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పిట్టల సరియలో ఊరి చివర ఉన్న తోటలో ఇప్పిలి రాజేష్, పాలిన వేనమ్మలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధమే మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment