Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Stampede at Mansa Devi temple in Uttarakhand's Haridwar1
మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట.. ఫేక్‌ వార్త ప్రచారమే కారణం!

Manasa Devi Temple Stampede.. డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హరిద్వార్‌ మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయం వద్ద ఆదివారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రావణమాసం, ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో.. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. हरिद्वार के मनसा देवी मंदिर में भगदड़, 6 लोगों की मौत◆ भगदड़ में 25 से 30 लोग घायल◆ बताया जा रहा है कि ये हादसा सीढ़ियों में करंट उतरने की वजह से हुआ #MansaDeviMandir | Mansa Devi Mandir | #MansaDeviTemple pic.twitter.com/V1pLALBwJC— News24 (@news24tvchannel) July 27, 2025 తొక్కిసలాట ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ "విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారని ఫోటోలు, వీడియోల ద్వారా తెలిసింది. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాక్‌కు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. సీసీటీవీ కెమెరాలు, ఇతర మార్గాలను పరిశీలిస్తాం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు" అని తెలిపారు.మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. భక్తుల భద్రత కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.ఇక, శివాలిక్ కొండలపై 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయం, హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. ఇది పాముల దేవత మా మానసా దేవి ఆలయం, పురాతన సిద్ధపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3— ANI (@ANI) July 27, 2025

Elon Musk gives CFO Vaibhav Taneja charge of Tesla and America Party Finances2
మస్క్‌ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్‌ తానేజా?

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్‌. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్‌ తానేజాను ట్రెజరర్‌, రికార్డుల కస్టోడియన్‌గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..వైభవ్‌ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.రూ.1,100 కోట్ల వేతనం2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు.

PM Modi Mann Ki Baat 124th Episode Highlights3
ఆగస్టు 23 నాటికి సలహాలు, సూచనలు పంపండి: ప్రధాని మోదీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని మోదీ చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ 124వ మన్‌కీ బాత్‌ కార్యక్రమం నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్‌ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో మోదీ.. ఇటీవల కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని పేర్కొన్నారు. చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్‌ సైన్స్‌పై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌ గురించి మాట్లాడారు. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో వస్తారని.. ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది చేరారన్నారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనలను నమో యాప్‌ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారన్నారు.In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారన్నారు. ముంబైలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్‌ ఒలింపియాడ్ జరుగునుందని చెప్పారు. ఇది అతిపెద్ద ఒలింపియాడ్‌ అవుతుందన్నారు. భారత్‌ ఇప్పుడు ఒలింపిక్స్‌, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందన్నారు.

Srushti Test Tube Baby Center Case: Dr Namrata Arrested4
‘సృష్టి’ కేసు.. డాక్టర్ నమ్రత అరెస్ట్

సాక్షి, హైదరాబాద్‌/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్‌ కరుణ ఆధ్వర్యంలో​ విజయవాడ సెంటర్‌ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్‌ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్‌ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్‌లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మోసం బయటపడింది ఇలా..నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్‌ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్‌ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్‌ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్‌ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ కాలేదు. దీంతో డాక్టర్‌ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్‌ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్‌ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.డాక్టర్‌ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం.

Shubman Gill-KL Rahul break major records with series-saving stand in Manchester5
చ‌రిత్ర సృష్టించిన రాహుల్‌-గిల్ జోడీ.. ప్రపంచంలోనే

మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది.311 ప‌రుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో య‌శ‌స్వి జైశ్వాల్‌(0), సాయిసుద‌ర్శ‌న్‌(0) పెవిలియ‌న్‌కు పంపాడు. భార‌త్ సున్నా ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో నాలుగో రోజే భార‌త క‌థ ముగుస్తుంద‌ని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్‌(87 బ్యాటింగ్‌), శుబ్‌మ‌న్ గిల్‌(78 నాటౌట్‌) త‌మ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడ‌గా నిలిచారు. వీరిద్ద‌రూ 62 ఓవ‌ర్లు పాటు త‌మ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో గిల్‌-రాహుల్ జోడీ ప‌లు అరుదైన ఘ‌న‌తల‌ను త‌మ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన త‌ర్వాత థ‌ర్డ్ వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన జోడీగా గిల్‌-రాహుల్ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు దిగ్గ‌జాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి ప‌రిస్థితుల్లో వీరిద్ద‌రూ మూడో వికెట్‌కు 105 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన రాహుల్‌-గిల్ జంట 49 ఏళ్ల త‌ర్వాత‌ ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ప్ర‌స్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మ‌న్ గిల్‌, రాహుల్ ఇద్ద‌రూ 500 ప‌రుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్ప‌టివ‌ర‌కు 697 ప‌రుగులు చేయ‌గా.. రాహుల్ 508 ర‌న్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త మాజీ క్రికెట‌ర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) ప‌రుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్‌.. 'జ‌స్ప్రీత్ బుమ్రా త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌'

Thanushree Dutta Eats Mutton on Sravanamasa Fasting Period6
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్‌ వండుకుని తిన్నా: హీరోయిన్‌

శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్‌ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. నటుడు నానాపటేకర్‌.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్‌ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్‌ చేస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రావణమాసం సందర్భంగా మటన్‌ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్‌ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్‌ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్‌ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్‌. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్‌ వండుకుని డిన్నర్‌ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్‌శ్రావణంలో మటన్‌ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్‌ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్‌ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్‌ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్‌గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్‌ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్‌ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్‌ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్‌ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్‌ చేయాలనుంది: నాగచైతన్య

Sakshi Editorial On Chandrababu, Pawan Kalyan By Vardhelli Murali7
రెండు కోహినూర్‌ కథలు!

నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్‌ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్‌. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్‌ లైన్‌లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్‌ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్‌ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ కోసం మరోసారి సింగపూర్‌ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్‌ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్‌ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్‌ ఏరియా ఒప్పందాన్ని జగన్‌ సర్కార్‌ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్‌ ఏరియా ఒప్పందంలో సింగపూర్‌ తరఫున మంత్రి ఈశ్వరన్‌ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్‌ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్‌కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్‌ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్‌ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్‌ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్‌ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్‌ బ్రాండ్‌ మనకు కోహినూర్‌ డైమండ్‌ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్‌పై ఓ కామెంట్‌ విసిరి ఆయన సింగపూర్‌ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్‌ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్‌ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్‌ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్‌ మెంట్‌ పార్ట్ట్‌నర్స్‌’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్‌ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్‌ నేతృత్వంలో వచ్చిన సింగపూర్‌ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్‌ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్‌ కథలో నిజంగానే కోహినూర్‌ డైమండ్‌ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్‌ కల్యాణ్‌ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్‌ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్‌ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్‌ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్‌ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్‌ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్‌ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్‌ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్‌షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్‌సింగ్‌ వశమై లాహోర్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్‌ వారితో లండన్‌కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్‌ కోహినూర్‌ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్‌ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్‌ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్‌ చేసిన క్రిష్‌ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్‌ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్‌ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్‌ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్‌ పవర్‌గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్‌ ది గ్రేట్‌ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్‌వాళ్లే కాని, మొఘల్స్‌ కాదు. బాబర్‌ సెంట్రల్‌ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్‌మహల్‌ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్‌ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ కాదా? బ్రిటిష్‌ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్‌లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

USA Denver Airport Smoke On AA-3023 Flight Runway Before Takeoff8
విమానం టేకాఫ్‌ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్‌ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్‌స్టాఫ్‌ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్‌ విమానాశ్రయం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్‌ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్‌ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025

Donald Trump Statement On Thailand And Cambodia Issue9
థాయ్‌, కంబోడియా శాంతి చర్చలకు గ్రీన్‌సిగ్నల్‌: ట్రంప్‌ సంచలన ప్రకటన

వాషింగ్టన్‌: థాయ్‌ల్యాండ్‌-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్‌ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌, థాయ్‌ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్‌ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్‌, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్‌.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్‌, భారత్‌ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025ఇదిలా ఉండగా.. థాయ్‌ల్యాండ్‌, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్‌-16 విమానాలు, డ్రోన్‌లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌ల్యాండ్‌ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్‌)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్‌ ఫియాక్ట్రా వెల్లడించారు.

Success Story of Dr. Siddha Lakshmi from Yellareddypet10
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!

ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్‌డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్‌ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్‌) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్‌ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్‌ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్‌డీ చేశాను. డాక్టర్‌ పాత నాగరాజు సార్‌ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్‌ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్‌ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్‌ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్‌.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement