రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం | Elderly Couple Died In Road Accident In Khammam, Details Inside | Sakshi
Sakshi News home page

Khammam Road Accident: రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం

Published Thu, May 16 2024 10:53 AM | Last Updated on Thu, May 16 2024 1:20 PM

Elderly couple died in road accident

బోనకల్‌(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్‌టేకర్‌గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్‌టేకర్‌ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్‌ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.

ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్‌టేకర్‌ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన      వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్‌ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement