
మైసూరు : వారం రోజుల క్రితం తండ్రి హత్యకు గురి కాగా తాజాగా అతని కుమారుడు కూడా దుండగుల చేతిలో బలయ్యాడు. ఈ విషాద ఘటన మైసురులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్‌పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మైసూరు తాలూకా, మండకళ్లికి చెందిన మరిగౌడ(48) ఈనెల 2న మైసూరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మార్గం మధ్యలో దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన మరువక ముందే అతని కుమారుడు సతీష్ శుక్రవారం మైసూరుకు బైక్‌పై వెళ్తుండగా దుండగులు అడ్డుకొని హత్య చేసి ఉడాయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్తి వివాదాల వల్లనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment