
పెదగంట్యాడ(గాజువాక): భరించలేని తలనొప్పి కారణంగా ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పందిరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె శ్రావణి (22) ఉన్నారు. కుమార్తె మూడేళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది. ఆమె డిగ్రీ కూడా మధ్యలో ఆపేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది.
శనివారం యువతి తండ్రి పని మీద నగరానికి వెళ్లగా, తల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. సోదరుడు మిత్రులతో కలసి బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడికి చేరే సరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి త్రండి ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment