నలుగురు యువకులను అరెస్ట్ చేసిన ఈడీ
పళ్లిపట్టు(తవిుళనాడు): యువకుల బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి నలుగురు యువకులను ఈడీ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు తరలించి దర్యాప్తు ముమ్మరం చేసిన ఘటన తమిళనాడులోని పళ్లిపట్టులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని పళ్లిపట్టు సమీపం కుమారాజుపేట దళితవాడకు చెందిన తమిళరసన్ (25), మెట్టూరుకు చెందిన అరవిందన్ (24), ప్రకాష్ (25)ల బ్యాంకు ఖాతాల్లో రూ.3కోట్లు అక్రమంగా జమ చేసినట్లు, గుర్తించి వారి అకౌంట్లు సీజ్ చేసిన బ్యాంకు అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు.
ముంబై. చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరికి చెందిన ఈడీ అధికారుల బృందం 20 మంది గురువారం కుమారాజుపేట, మోట్టూరులో గురువారం ఉదయం నుంచి శుక్రవారం వేకువజాము వరకు దాడులు నిర్వహించి వారిని విచారించారు.
తమిళరసన్ తమ్ముడు అజిత్‌కు సైతం సంబంధం ఉందని నిర్ధారించి నలుగురిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. యువకుల ఖాతాల ద్వారా రూ.8 కోట్ల వరకు హవాలా డబ్బులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులెవరూ అన్న కోణంలో ఈడీ విచారణ జరుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment