సుశీల హత్యకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణి తదితరులు
సారవకోట: మండల కేంద్రంలోని హరిజన వీధికి చెందిన గొంటి సుశీల(32)ది ఆత్మహత్య కాదని హత్యేనని ఎస్సై ముకుందరావు స్పష్టం చేశారు. భర్తే హంతకుడని పేర్కొన్నారు. అతనికి సోదరుడు కూడా సహకరించినట్టు చెప్పారు. పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, పాతపట్నం సీఐ రవిప్రసాద్‌తో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ.. హత్యకు దారితీసిన విధానాన్ని వివరించారు. సుశీల స్థానికంగా జరుగుతున్న మహాశివరాత్రి యాత్ర మహోత్సవానికి శనివారం వెళ్లివచ్చింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న భర్త గురుమూర్తి ఎక్కడికి వెళ్లావని నిలదీస్తూ భార్యతో గొడవ పడ్డాడు.
తరువాత సుశీల పశువుల శాల తుడిచేందుకు వెళ్లగా.. గురుమూర్తి కూడా వెళ్లాడు. అక్కడ ఉన్న యూరియా గోనె సంచె ముక్కను సుశీల మెడకు గట్టిగా బిగించడంతో స్పృహ తప్పిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను గురుమూర్తి, అతని తమ్ముడు ఎండెయ్య సహాయంతో పశువుల శాలలోని కర్రకు తాడుతో కట్టేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించి బయటకు వచ్చేశారు. కాసేపు తరువాత ఎండెయ్య ఏం తెలియనట్టు.. పెద్దమ్మ, పెద్దనాన్న గొడవ పడ్డారని, పెద్దమ్మ ఏమి చేస్తుందో చూడండని తన పిల్లల్ని పంపించారు. వారు వెళ్లి శాలలో చూడగా.. ఉరి వేసుకుని ఉన్నట్లు చెప్పడంతో ఏమీ తెలియనట్టు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి సుశీలను కిందికి దించినట్టు ఎస్సై వివరించారు.
గురుమూర్తి, సుశీలలు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండేవారని, ఆ కారణంగానే ఆమె ఉరి వేసుకొని ఉంటుందని స్థానికులు కూడా భావించారన్నారు. మీ కుమార్తె ఉరి వేసుకుని మృతి చెందిందని సుశీల తల్లి సరసమ్మకు సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొవడంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వాస్తవం వెలుగు చూసిందన్నారు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసిందన్నారు. సుశీలను హత్య చేసిన విధానాన్ని భర్త గురుమూర్తి వివరించారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్ఛాపురం: జాతీయ రహదారి–16పై బెల్లుపడ టోల్‌ప్లాజా(ఓల్డ్) వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నీలా పు శ్రీను(21) అనే యువకుడు మృతి చెందాడు. బెల్లుపడ గ్రామానికి చెందిన నీలాపు శ్రీను పెయింటింగ్ పనులు చే సుకుంటూ బతుకుతున్నాడు. ఆదివారం తన స్నేహితుడు కొచ్చెర్ల జగదీ‹Ùతో స్కూటీపై ఇంటికి వస్తుండగా బెల్లుపడ టోల్‌ప్లాజా(ఓల్డ్) వద్ద బరంపురం నుంచి పలాస వైపు వస్తు న్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీను తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు జగదీష్‌కు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో బరంపురం మెడికల్‌కు తరలించారు. యువకుడి మృతితో బెల్లుపడ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై పోక్సో కేసు
వంగర: మండల పరిధి మరువాడకు చెందిన 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో విజయనగరం జిల్లా బలిజిపేట మండలానికి చెందిన డర్రు విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంచాన చిరంజీవి ఆదివారం తెలిపారు. ఈ విషయంపై జనవరి నెలలో వంగర పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. సుదీర్ఘకాలంగా పలు రాష్ట్రాల్లో వంగర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం కేసును ఛేదించారు. విద్యాసాగర్‌పై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
చదవండి: బెంగళూరులో మైదుకూరు విద్యార్థి ఆత్మహత్య!
పరువు కోసం కూతురిని కడతేర్చిన తండ్రి
Comments
Please login to add a commentAdd a comment