
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి కరోనాతో మృతి చెందినట్లు చిత్రీకరించాడో భర్త. ఈ సంఘటన వనస్థలీపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వనస్థలీపురానికి చెందిన విజయ్ కొద్దిరోజుల క్రితం భార్య కవితను హత్య చేశాడు. ఆమె కరోనాతో మృతి చెందిందని అందర్నీ నమ్మబలికి అంత్యక్రియలు సైతం నిర్వహించాడు.
అయితే విజయ్‌పై అనుమానం వచ్చిన అత్తమామలు తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కవిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కరోనాతో మరణించలేదని తేలింది. దీంతో విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment