
సాక్షి, విజయవాడ : స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద పదిమందికి నోటీసులు అందచేశారు. వీరంతా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.(స్వర్ణ ప్యాలెస్ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం)
Comments
Please login to add a commentAdd a comment