
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రేమోన్మాదులు చెలరేగిపోతున్నారు. కర్నూలు జిల్లా ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్‌లో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని మృతిచెందింది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేష్ అనే యువకుడు ప్రెటోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది.
విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థిని మృతి పట్ల బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సంతాపం తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళలకు దిశ చట్టం ద్వారా రక్షణ కల్పించామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక దిశ చట్టాన్ని రద్దు చేసిందని, ఆ యాప్ కూడా మనుగడలో లేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది.
మరో ఘటనలో..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు.

కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణని గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్న @ncbn.#APisNotinSafeHands#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule pic.twitter.com/AYYengnuC3
— YSR Congress Party (@YSRCParty) October 19, 2024
ఇదీ చదవండి: నేను నిన్ను మోసం చేసాను..
Comments
Please login to add a commentAdd a comment