Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Takes On Education System In AP1
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: ఏపీ ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

Zelensky seeks US help Need Very Urgency2
అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్‌ స్కీ వేడుకోలు

రష్యా-ఉక్రెయిన్‌ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్‌ స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. ‘మాకు రక్షణ కావాలి. అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం​. స‍్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్‌-16 పైలట్‌ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్‌ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్‌ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్‌ స్కీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్‌ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్‌ స్కీ.Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025 రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే

Drone Hits Podium As Tejashwi Yadav Addresses Crowd In Bihar3
సభలో కలకలం.. తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌

పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం.. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో ‘సేవ్‌ వక్ఫ్‌, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరిట ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తేజస్వీ ప్రసంగిస్తుండగా ఆయన వైపు ఓ డ్రోన్‌ దూసుకొచ్చింది. ర్యాలీ వీడియో కవర్‌ చేసేందుకు డ్రోన్‌ ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్‌.. తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతుండగా దిశ మారి.. హఠాత్తుగా ఆయన వైపుకు వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తేజస్వీ యాదవ్‌ తన ప్రసంగాన్ని ఆపేసి వెనక్కి జరిగి.. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.కాగా, భద్రతా సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పాట్నా సెంట్రల్‌ ఎస్పీ దీక్ష స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం.. నిషేధిత ప్రదేశమని డ్రోన్లు ఎగరవేయకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.VIDEO | Patna: While addressing ‘Waqf Bachao, Samvidhan Bachao Sammelan’ at Gandhi Maidan, RJD leader Tejashwi Yadav (@yadavtejashwi) narrowly escapes injury as a drone crashes into the podium.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/66B1fMRaHs— Press Trust of India (@PTI_News) June 29, 2025

conspiracy theory against kethireddy pedda reddy,High Tension In Tadipatri4
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌

సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్‌ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్‌లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు.

Jaipur Couple Found Dead At Their House5
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!

వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్‌ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్‌ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్‌ రాష్ట్రంలోనే జైపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్‌. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్‌పూర్‌ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్‌ హాలీ డేస్‌కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్‌ జంట ఈ శుక్రవారం(జూన్‌ 27వ తేదీ) తమ ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్‌ సేల్స్‌ మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్‌కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్‌ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్‌గా ఫ్లాట్‌ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్‌లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్‌లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్‌లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్‌.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్‌.. ఒక క్యారీ బ్యాగ్‌ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్‌ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్‌ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్‌ అధికారి అజయ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్‌ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.

Raghava Lawrence Emotional Post on Child Artist Ravi Raj Rathod6
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్‌ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన రవిరాజ్‌ రాథోడ్‌ను కొన్నేళ్ల కిందట లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ను చదివించాలనుకున్న లారెన్స్‌తన ట్రస్ట్‌ ద్వారా మంచి హాస్టల్‌ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్‌ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్‌ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్‌ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్‌ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్‌ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్‌ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్‌లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో చెన్నైలోని లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అడ్రస్‌ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్‌, అధిగరం, కాల భైరవ, బుల్లెట్‌, హంటర్‌ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్‌ చేస్తున్నాడు.చదవండి: దిల్‌రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

Indian Woman Missing In Us Days After Arriving For Arranged Marriage7
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్‌

పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్‌ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్‌ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్‌ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్‌ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

వెలగలవారిపాలెం(ఆర్‌) పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని8
AP: పాఠశాల ఉంది.. పాఠం వినేవారు లేరు..!

పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్‌) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్‌ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్‌ టీచర్‌ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు.వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గవర్నమెంట్‌ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తూ ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఎంత వరకూ శ్రద్ధ చూపిస్తుందనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.వెలగలవారిపాలెంలో దళితవాడలో నాడు-నేడులో నిర్మించిన భవనం

ZIM VS SA 1st Test: Keshav Maharaj Becomes The First South African Spinner To Take 200 Test Wickets9
సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్‌ మహారాజ్‌

సౌతాఫ్రికా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్‌ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్‌ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్‌ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్‌ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్‌ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్‌ బౌలర్‌గా కేశవ్‌ మహారాజ్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్‌ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ వికెట్‌ కేశవ్‌కు 200వ టెస్ట్‌ వికెట్‌. కేశవ్‌ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్‌ (170), పాల్‌ ఆడమ్స్‌ (134), పాల్‌ హ్యారిస్‌ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్‌ స్టెయిన్‌ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్‌ పోలాక్‌ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్‌ (330), మోర్కెల్‌ (309), కల్లిస్‌ (291), ఫిలాండర్‌ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్‌ బౌలర్లే.మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్‌ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బ్రియాన్‌ బెన్నెట్‌ (19) రిటైర్డ్‌ హర్ట్‌ కాగా.. కైటానో 0, వెల్చ్‌ 4, క్రెయిగ్‌ ఎర్విన్‌ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్‌ విలియమ్స్‌ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్‌ 2, కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153), కార్బిన్‌ బాష్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు.

EPF Interest Credit Update Check If 8 25pc Interest Is Credited10
వడ్డీ సొమ్ము వచ్చిందా.. ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ చూసుకున్నారా?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ ఖాతాల్లో 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయడం ప్రారంభించింది. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి. దీనికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ పంపలేదు. కానీ చాలా మందికి ఇప్పటికే తమ పాస్ బుక్‌లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తోంది.వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదంగత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశంలో ఈపీఎఫ్‌పై ప్రతిపాదించిన 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.వడ్డీని ఎలా లెక్కిస్తారు?ప్రతి నెలా ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. యజమాని వాటా కూడా 12 శాతం ఉంటుంది. అయితే ఇది పెన్షన్ పథకానికి 8.33%, ఈపీఎఫ్ ఖాతాకు 3.67% చొప్పున జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది. చక్రవడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు. ఇది ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్స్ రెండింటికీ వర్తిస్తుంది (పెన్షన్ భాగం మినహా). సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమవుతుంటుంది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్‌ సర్వీసెస్‌ > ఫర్‌ ఎంప్లాయీస్‌ > మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్‌ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్‌బుక్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోతే..కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్ బుక్‌లో ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కొన్ని రోజులు వేచి చూసి మళ్లీ తనిఖీ చేయండి. అప్పటికీ కనిపించకపోతే ఆన్‌లైన్లో లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement