సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆర్ట్స్ కళాశాలలో మార్చి 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పోలీసులు, పరిశ్రమలు, వైద్య, ఆరోగ్యం, మెప్మా పీడీ, డీఆర్‌డీఏ పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేయాలని, మహిళల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అందజేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 5న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు, సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు, ఒత్తిడిని అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. బొమ్మూరులో ఇంటింటా పోస్టర్లు అతికించాలని సూచించారు. 6న నర్సరీలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. 7న బొమ్మూరు మహిళా ప్రాంగణంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు మహిళా చట్టాలు, సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 8న ఆర్ట్స్ కాలేజీలో మహిళా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment