వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
● పీఏసీలో కీలక ప్రాతినిధ్యం
● నియామకాల్లో సామాజిక సమతూకం
● బోస్, తోట, విశ్వరూప్,
ముద్రగడకు చోటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలు కీలక నియామకాలు చేపట్టింది. మండల, గ్రామ స్థాయిలో నూతన కమిటీల నియామకాల్లో పాత, కొత్త నేతల కలయికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీలో అత్యున్నతమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అధిష్టానం అగ్రాసనం వేసింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టారు. పీఏసీ సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నియమించారు.
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం శనివారం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,80,809 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. మూడు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు.
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం


