సౌత్ ఇండియా సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక
దెందులూరు: పుదుచ్చేరిలో ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కి ఏలూరు జిల్లా దెందులూరు ఉన్నత పాఠశాల బోటని ఉపాధ్యాయురాలు బీఎస్‌ఎన్‌కే కళ్యాణి ఎంపికయ్యారు. ఈనెల 7, 8 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ఉపాధ్యాయుల విభాగంలో ఉపాధ్యాయురాలు కళ్యాణి వైద్య, వ్యవసాయ, ఆహార పరిశోధన రంగాలకు దోహదపడే విధంగా ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ డీఎన్‌ఏ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. దీంతో ఆమెను సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కి ఎంపికచేస్తూ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఎస్‌సీఈ ఆర్‌టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి ఉన్నతాధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. డీఈవో వెంకటలక్ష్మమ్మ ఉపాధ్యాయురాలు కళ్యాణిని అభినందించారు.
ఏలూరు ఏరువాక కేంద్రానికిబెస్ట్ డాట్ సెంటర్ అవార్డు
ఏలూరు(మెట్రో): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి గాను వ్యవసాయంలో రైతులకు అందించిన సేవలకుగాను ఏలూరు ఏరువాక కేంద్రానికి బెస్ట్ డాట్ సెంటర్ అవార్డు లభించింది. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన 54వ ఆర్‌ఈఏసీ మీటింగ్‌లో ఈ అవార్డును ప్రకటించారు. ఏఎన్‌జీఆర్‌ఏయూ ఉపకులపతి డాక్టర్ శారద జయలక్ష్మి, ఏపీ వ్యవసాయ కమిషనర్ అండ్ డైరెక్టర్ డా.ఢిల్లీరావు చేతుల మీదుగా ఏలూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.ఫణికుమార్ అవార్డు అందుకున్నారు. విశ్వ విద్యాలయ పరిశోధన సంచాలకులు డా. పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డా.జి.శివన్నారాయణ పాల్గొన్నారు.
ముగిసిన జాతీయస్థాయి సెమినార్
దెందులూరు: గోపన్నపాలెంలోని శ్రీసీతారామా ప్రభుత్వ వాయామా కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘అథ్లెటిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్’ జాతీయస్థాయి సెమినార్ బుధవారం ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో రిసోర్స్ పర్సన్‌గా చీఫ్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాక్టర్ వినాయక ప్రసాద్, ప్రిన్సిపాల్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సూరంపాలెం, డాక్టర్ ఎస్.సరోజి, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సీబీఐటీ హైదరాబాద్ నుంచి డాక్టర్ రాజు హాజరయ్యారు. అథ్లెటిక్స్‌లోని మెలకువలపై విద్యార్థులకు వివరించారు. ముగింపు సభకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నతానియేల్ అధ్యక్షత వహించారు.
సౌత్ ఇండియా సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక
సౌత్ ఇండియా సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక


