కృత్రిమ మేధ వినియోగం పెరిగింది
తాడేపల్లిగూడెం: కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీవీ శర్మ అన్నారు. సోమవారం ఏపీ నిట్‌లో అన్మేన్డ్ ఏరియల్ వెహికల్స్ ఫర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అంశంపై జరిగిన ిస్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాపులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. రిమోట్ కంట్రోల్ సహాయంతో పనిచేసే సమర్థవంతమైన డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఆన్‌లైన్‌లో పాల్గొన్న మరో అతిథి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మానవరహిత వాహనాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ దిశగా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నిఘా నేత్రాలుగా డ్రోన్లు అద్భుత పాత్ర పోషిస్తున్నాయని నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, డీన్ రవికిరణ్ శాస్త్రి అన్నారు. నై పుణ్యాల మెరుగుకు ఇలాంటి కార్యక్రమాలు దో హదపడతాయని ఈసీఈ విభాగాధిపతి భానావతు నర్సింహారావు అన్నారు. వి.సందీప్, గుర్రాల కిరణ్‌కుమార్, కార్తికేయశర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment