సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీ చూపి భక్తురాలికి హ్యాండ్‌బ్యాగ్‌ను అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. సోమ వారం కాకినాడకు చెందిన ఓ భక్తురాలు శ్రీవారి దర్శనానికి విచ్చేసి స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న కల్యాణ మండపంలో కాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌ను మండపంలో విడిచి వెళ్లిపోయారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది హ్యాండ్ బ్యాగ్‌ను తెరిచి చూడగా బంగారు నగలు ఉన్నాయి. వెంటనే దానిని ఆలయ అధికారులకు అప్పగించారు. అధికారులు మైక్ ద్వారా అనౌన్స్ చేసి బాధిత భక్తురాలికి బ్యాగ్‌ను అందజేశారు. సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీని భక్తులు మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment