
కూటమికి ఓటమి రుచి చూపిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు తొమ్మిది నెలల కాలంలోనే ఓటమి రుచి చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి వ్యతిరేకతను చూపించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఐఆర్, పీఆర్సీ, డీఏల విషయంలో ఏమీ ప్రకటించలేదని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పై సానుకూల వైఖరి లేకపోవటమే కూటమి ఓ టమికి కారణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను సమస్యలు పరిష్కరించాలని కోరారు.
జాతీయ పురస్కారానికి ‘బీ ఏ హ్యూమన్’ ఎంపిక
జంగారెడ్డిగూడెం: జాతీయ ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి బీ ఏ హ్యూమన్ లఘు చి త్రం ఎంపికైంది. 2024 లఘుచిత్ర పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన ఔత్సాహిక దర్శకుడు నవీన్ లొట్ల నిర్మించిన బీ ఏ హ్యూమన్ విజేతగా నిలిచింది. సోమవారం నవీన్ మాట్లాడుతూ జాతీయ స్థాయికి 303 లఘుచిత్రాలు ఎంట్రీ సాధించగా, వాటిలో 7 చిత్రాలు విజేతలుగా నిలిచాయన్నారు. వాటిలో బీ ఏ హ్యూమన్ ఒకటని, గృహ హింస, మహిళలపై దాడులు, ఆడబిడ్డలను అనాథలుగా వదిలేయడం, సమాజ జో క్యం ఇతివృత్తంగా దీనిని నిర్మించామన్నారు. ఈ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంతో పాటు స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. స్థానికులు శైలజ, బాబీ, ఎల్‌ఆర్ కృష్ణబాబు, సింధు రాజ్‌కుమార్, త్రిపుర, పోతురాజు, వల్లి, అశోక్ లఘుచిత్రంలో నటించారని, రాజ్‌కిరణ్ (కెమెరా), ఆలీ (డబ్బింగ్ బీజీఏం), డబ్బింగ్ ఆర్టిస్ట్ పర్వీన్ సహకరించారన్నారు. పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిగా జాతీయ మానవ హక్కుల సంఘం అందించనుందని, త్వరలో ఢిల్లీలో పురస్కారాన్ని అందుకోనున్నానని నవీన్ తెలిపారు.
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాను రూపొందించినట్టు ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో, పాఠశాలల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోపు సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని, ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉంటే జత చేయాలని తెలిపారు. గడువు తర్వాత అందిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలక ఏలూరు డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
పాలకొల్లులో
మరో పసికందు గుర్తింపు
విజయవాడ స్పోర్ట్స్: నెలలు నిండని పసి కందులను విక్రయిస్తున్న విజయవాడ మహిళల ముఠా నుంచి మరో చంటి బిడ్డను ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం కాపాడింది. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న విజయవాడ ముఠాను ఈనెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో 2వ తేదీ ఆదివారం రాజమండ్రిలో ఓ చంటి బిడ్డను పోలీసులు స్వాధీనం చేసుకుని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యా ప్తులో భాగంగా మరో పసికందును పశ్చిమగోదా వరి జిల్లా పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కె.లతాకుమారి, మహిళా పోలీసులు ఈ పాపను వారి చేతుల్లోకి తీసుకొని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

కూటమికి ఓటమి రుచి చూపిన ఉపాధ్యాయులు

కూటమికి ఓటమి రుచి చూపిన ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment