6న కోకో రైతుల ధర్నా
పెదవేగి: కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, కిలో గింజలకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఏపీ కోకో రైతు ల సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం పెదవేగి మండలం విజయరాయిలోని కోకోనట్ గ్రోయర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద చలో కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజలకు రూ.900 వరకు ధర ఉన్నా కొనుగోలు కంపెనీలు ఆ ధరను చెల్లించడం లేదన్నారు. ప్రాంతీయ కొబ్బరి రైతుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు రా మకృష్ణ, కోకో రైతుల సంఘం నాయకులు కోనేరు సతీష్, రాపర్ల తేజ కృష్ణ, వట్టికూటి రామవతారం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment