నిరాశపర్చిన పొగాకు ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ప్రారంభ ధర రైతులను నిరాశ పర్చింది. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో సోమవారం కొనుగోలు ప్రారంభమైంది. ప్రారంభ ధర కేజీకి రూ.290 పలికింది. సరాసరి ధర కంటే రూ.340 పలుకుతుందని ఆశించారు. గత ఏడాది ధర దృష్ట్యా కౌలు ధరలు, ఎరువులు, రైతు కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. గత ఏడాది వర్జీనియా వేలం ప్రక్రియపై నమ్మకంతో అధిక పెట్టుబడులతో ఎక్కువ పంటను పండించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే 20 మిలియన్ల కేజీల పంట అధికంగా ఉండొచ్చని అంచనా. గరిష్ట ధర 400 పైగా రావాలని, సరాసరి రూ.350కి తగ్గకుండా వస్తేనే ఈ ఏడాది రైతులు గట్టెక్కే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
ప్రారంభ ధర కేజీకి రూ.290
సరాసరి రూ.350 పైగా వస్తేనే గిట్టుబాటు
సరైన ధర వచ్చేలా చూడాలి
తొలి రోజు ధర ఏ విధంగాను ఆమోదయోగ్యం కాదు. గత ఏడాది వేలం ప్రక్రియ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ధర మీద ఆశతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిర్ధేశించిన దాని కంటే ఎక్కువ పండిందని అధికారులు చెబుతున్నారు. కనీసం వారు నిర్ధేశించిన లక్ష్యానికై నా రూ.411 పైగా ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు
నిరాశపర్చిన పొగాకు ధర


