ద్వారకాతిరుమల: మండలంలోని తక్కెళ్లపాడులో పశు సంవర్ధక శాఖ, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. అందులో 25 గేదె దూడలు, 15 ఆవు దూడలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పశు పోషణ, జాతి లక్షణాల ఆధారంగా రైతులకు బహుమతులను భీమడోలు ఏడీ డాక్టర్ సాయి రమేష్ అందజేశారు. అనంతరం వైద్యులు 4–6 నెలల వయస్సున్న 30 పెయ్యి దూడలకు బ్రూసెల్ల టీకాలు వేశారు. లేగ దూడలు పశు పోషణలో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తరువాత ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులందరికీ కాల్షియం, లివర్ టానిక్, గోమర్లు మందు, స్టీల్ క్యాన్‌లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల పశు వైద్యాధికారులు అంగర సురేష్, హరికృష్ణ, పాడి రైతులు బొల్లారెడ్డి సూర్యనారాయణ రెడ్డి, మానికల రామకృష్ణ, ముల్లంగి కృష్ణారెడ్డి, షేక్ మస్తాన్ సాహెబ్, పశు గణాభివృద్ధి సిబ్బంది, పశు సంవర్థక శాఖ సిబ్బంది, ఏహెచ్‌ఏలు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.


