డాక్టర్ జగదీష్‌కు అవార్డు
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్, తిరుమల తిరుపతి బర్డ్ ఆస్పత్రుల మాజీ డైరెక్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ శ్రీవిశ్వవైద్య దివ్యాంగ బంధుశ్రీ అవార్డును అందుకున్నారు. మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో ఆదివారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి నవీన్ రామ్‌గులామ్ డాక్టర్ జగదీష్‌కు అవార్డును అందజేశారు. వైద్య రంగంలో జగదీష్ చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. జగదీష్ సోమవారం ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక – సాంస్కృతిక సంస్థ అయిన మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు ప్రజల వారసత్వం, సంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి వేదికై ందన్నారు. వికలాంగుల పునరావాసం, సమాజ సేవకు అంకితమవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనేక దేశాల్లో ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపులు నిర్వహించి సేవలను విస్తరించామని చెప్పారు. ఇంతవరకు అనేక దేశాల్లో క్యాంపులు నిర్వహించి, 1.83 లక్షలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి, దివ్యాంగుల అంగవైకల్యాన్ని రూపుమాపామన్నారు.


